ఐ.బి.పి.ఎస్ రూరల్ బ్యాంక్స్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్యాట్రన్

 

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్ (ఐబిపిఎస్) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బి) ఆఫీసర్లు (స్కేల్-I, II, III), ఆఫీసు అసిస్టెంట్లు (మల్టీ పర్పస్) నియామకానికి ఉమ్మడి రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రాత పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది.

ఆఫీసు అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I
1. రీజనింగ్ -40 ప్రశ్నలు- 50మార్కులు
2. న్యూమరికల్ ఎబిలిటీ/-40 ప్రశ్నలు- 50మార్కులు
క్యాంపిటీటివ్ ఆప్టిట్యూడ్
3. జనరల్ అవేర్‌నెస్-40 ప్రశ్నలు- 40 మార్కులు
4. ఇంగ్లిష్ లేదా హిందీ-4కైపశ్నలు- 40 మార్కులు
5. కంప్యూటర్ నాలెడ్జ్-40ప్రశ్నలు- 20 మార్కులు
మొత్తం:200 200
సమయం : 2గంటల 30 నిమిషాలు
ఆఫీసర్ స్కేల్-II, III
1. రీజనింగ్ -40 ప్రశ్నలు -50 మార్కులు
2. క్యాంపిటీటివ్ ఆప్టిట్యూడ్,
డేటా ఎంటర్ ప్రిటేషన్ -40 ప్రశ్నలు - 50 మార్కులు
3. ఫైనాన్షియల్ అవేర్‌నెస్ -40 ప్రశ్నలు - 40 మార్కులు
4. ఇంగ్లీష్ లేదా హిందీ -40 ప్రశ్నలు - 40 మార్కులు
5. కంప్యూటర్ నాలెడ్జ్ -40 ప్రశ్నలు - 20 మార్కులు
నోట్: స్కేల్-II స్పెషలిస్ట్ ఆఫీసర్లకు అదనంగా 40 మార్కులకు 40 ప్రశ్నలతో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. 
సమయం: 2గంటల 30 నిమిషాలు

 

ఎపిపిఎసి స్టడీ మెటీరియల్ జనరల్ సైన్స్-14

APPSCరసాయనశాస్త్రం ఆరు మార్కుల భాగస్వామ్యం 
ఈ విశ్వమంతా పదార్థం (matter) శక్తి (Energy)తో నిర్మితమై ఉన్నది. పదార్థం శక్తిగా, శక్తి పదార్థంగా నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి పదార్థానికి (జీవ, నిర్జీవ) భౌతిక లక్షణాలు, రసాయన లక్షణాలు ఉంటాయి. రసాయన శాస్త్రం విశ్వం లోని ప్రతి పదార్థానికి సంబంధించిన రసాయన తత్వాన్ని, రసాయన స్వభావాన్ని వివరిస్తుంది. ఒక పదార్థానికి చెందిన నిర్మాణం తెలిస్తే దాని స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. పోటీపరీక్షల కోణంలో రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, మూలకాలు, ఆమ్లాలు, క్షారాలు, వాయు ధర్మాలు, రసాయన చర్యలు, కర్బన రసాయన శాస్త్రం, పారిశ్రామిక రసాయన శాస్త్రం ముఖ్యమైన అంశాలు.
ఇందులో నిత్యజీవితంలో రసాయన శాస్త్రం ఉపయోగపడుతున్న విషయాల మీద ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. రసాయన శాస్త్రంలో సగటున 6 ప్రశ్నలు రావడానికి అవకాశముంది. అంటే జనరల్ సైన్స్‌లో 20-25 ప్రశ్నలు అడుగుతుంటే అందులో పావుభాగం కెమిస్ట్రీ నుంచే ఉండటం విశేషం.
names1.రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని ఏమంటారు? ( )
1. అయానిక 2. సమయోజనీయ
3. వాండల్ వాల్ 4. దృవశీల సమయోజనీయ
2.పరమాణువులోని వేటి సంఖ్య పరమాణు సంఖ్యకు సమానంగా ఉంటుంది? ( )
1. ఎలక్ట్రాన్‌ల 2. ప్రోటాన్‌ల
3. న్యూట్రాన్‌ల 4. 1, 2
3. ద్రవ్యరాశి సంఖ్య ఒకే విధంగా ఉండి పరమాణు సంఖ్య వేరుగా ఉన్న మూలకాలను ఏమంటారు( ) 
1. ఐసోటోపులు 2. ఐసోటోనులు
3. ఐసోబార్లు 4. ఐసోమర్‌లు
4. పరమాణువులను బలమైన అయస్కాంత క్షేత్రానికి గురిచేససిప్పుడు వాటి వర్ణపటాలలోని రేఖల సూక్ష్మ విభజనను ఏమంటారు? ( )
1. జీమన్ ఎఫెక్ట్ 2. స్టార్క్ ఎఫెక్ట్
3. రామన్ ఎఫెక్ట్ 4. ఫ్లాంక్స్ ఎఫెక్ట్
5. కేంద్రక నమూనా లేదా గ్రహమండల నమూనాను ప్రతిపాదించింది? ( )
1. రూథర్‌ఫర్డ్ 2. జె.జె థామ్సన్ 
3. హెచ్‌జె థామ్సన్ 4. నీల్స్ బోర్
6.జర్మన్ సిల్వర్‌లో సిల్వర్ శాతం( )
1. 50% 2. 75%
3. 100% 4. 0 %
7. ఎసిడిటిని తగ్గించడానికి, బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగపడేది? ( )
1. సోడియం కార్బోనేట్
2. సోడియం హైడ్రాక్సైడ్
3. సోడియం బైకార్బోనేట్
4. సోడియం పెరాక్సైడ్ 
8.NH4N03 మరియు Al పొడిల మిశ్రమాన్ని అమ్మోనాల్ అంటారు ఇది ఒక ( )
1.పేలుడు పదార్థం
2. శీతలీకరణి
3. ఉత్పతన పదార్థం 
4. భాష్పీభవన పదార్థం
9.జడవాయువులలో ఏ మూలకం సమ్మేళనా లను ఏర్పరుస్తుంది( )
1. He 2. Ne 3. Ar 4. Xe
loham10.కాన్సర్ నివారణలో ఉపయోగపడే రేడియోధార్మిక పదార్థం
1. కార్బన్-14 2. అయోడిన్-135 ( )
3. కోబాల్ట్-60
4. సోడియం-24
11.నూనెల హైడ్రోజినీకరణంలో ఉత్ప్రేర కంగా ఉపయోగపడేది ( )
1. నికెల్ 2. కోబాల్ట్
3. సోడియం 4. పొటాషియం
12.ఈ కింది ఆమ్లాలలో దేనిని ఆమ్ల రాజు అంటారు
1. H2SO4 2. HNO3 ( )
3. HCl 4. KCl
13.ఈ కింది వాటిలో ఏది నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగిస్తుంది( )
1. అయాన్ వినిమయ పద్ధతి 
2. సోడియం కార్బొనేట్
3. కాల్గాన్ 4. పైవన్నీ
14.ఈ కింది వాటిలో వేటితో తయారు చేసిన సబ్బు మృదువుగా ఉంటుంది( )
1. సోడియం హైడ్రాక్సైడ్ 2. కాల్షియం హైడ్రాక్సైడ్
3. పొటాషియం హైడ్రాక్సైడ్ 4. కాల్షియం సల్ఫేట్
15.ఆల్కాహాల్‌ను సేవించడం వల్ల ఏ అవయవం దెబ్బతింటుంది( )
1. కాలేయం 2. క్లోమం
3. గుండె 4. మూత్రపిండాలు
16.డ్యూరాల్యుమన్‌లో ఉండే మూలకం? ( )
1. అల్యూమినియం 2. మెగ్నీషియం
3. రాగి 4. పైవన్నీ
17.ఉక్కుతో సమాన బలం కలిగి, దాని బరువులో సగం మాత్రమే ఉన్న లోహం( )
1. కాడ్మియం 2. టైటానియం
3. జిర్కోనియం 4. పెల్లాడియం 
18.ప్రపంచంలో తయారు కాబడిన మొదటి మిశ్రమం
1. ఇత్తడి 2. బంగారం ( )
3. కంచు 4. వెండి
19.బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం? ( ) 
1. COCl2 2. CaCl2
3. COCaCl3 4. ClO2
20.ఎయిర్‌డై తయారీలో ప్రధానంగా ఉపయోగించేది( )
1. హైడ్రోజన్ పెరాక్సైడ్ 2. పొటాషియం హైడ్రాక్సైడ్
3. కాల్షియం పెరాక్సైడ్ 4. మెగ్నీషియం ఆక్సైడ్

ప్రీవియస్ క్వశ్చన్స్

1.వంట గదిలో ఉపయోగించు అంటుకొనని పాత్రలకు
చేసే లేపనం? నగూప్-1, 2010) ( 2 )
1. పాలివినైల్ క్లోరైడ్ 2. పాలిటెట్రా ప్లూరో ఎథిలిన్
3. పాలిథైలిన్ 4. పాలియామైడ్
2.కంచు దేని మిశ్రమలోహం? (Asst.Chemical Examiners-200) ( 3)
1. రాగి, తగరం
2. తుత్తునాగం, తగరం
3. రాగి, తుత్తునాగం (టిన్)
4. రాగి, ఇనుము
3. మేఘమథన ప్రక్రియలో వాడే రసాయనం ఈ కిందివానిలో? (Asst.Chemical Examiners-200) 
1. సిల్వర్ అయోడైడ్ ( 1 ) 
2. సిల్వర్ బ్రోమైడ్
3. ఫాస్పరస్
4. సల్ఫ్యూరిక్ ఆసిడ్
4. రసాయనాల రాజు అని దేనిని అంటారు? (4 )
(జూనియర్ అసిస్టెంట్స్ - 2007)
1. హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2. వజ్రం
3. ఆక్సిజన్ 4. పొటాషియం పర్మాంగనేట్
5. గృహోపకరణ ఇంధనంగా ఈ కింది వానిలో ఏ వాయువును ఉపయోగించవచ్చును నగూప్-2, 2002)
1. ప్రాణవాయువు 2. నత్రజని (3 )
3. మీథేన్ 4. ఉదజని