PREVIOUS DSC EXAM PAPERS

కరెంట్ అఫైర్స్

 

అన్ని రకాల పోటీ పరీక్షలకు వర్తమానాంశాలు (కరెంట్ అఫైర్స్) చాలా కీలకమైనవి.
విషయం పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి తెలుసు.
కానీ... అంశాలు పరీక్ష రీత్యా ముఖ్యం!
ఎంత వరకు చదవాలి?
ఎలా సేకరించుకోవాలి?
ఇవన్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలే...
అనవసరమైనవన్నీ పోగేసి చదువుకోవడం వల్ల విలువైన సమయం వృథా అయిపోతుంది.

 జీవశాస్త్రం

నాడీ వ్యవస్థ; మొక్కలు, జంతువుల్లో నియంత్రణ, సమన్వయం

1. శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ?
ఎ) జీర్ణ బి) వినాళ గ్రంథి
సి) నాడీ డి) ప్రసరణ

2. వార్తలు గ్రహించి, వాటిని విశ్లేషించి సమన్వయపర్చే ముఖ్య కేంద్రం?
ఎ) హృదయం బి) వెన్నెముక
సి) పీయూష గ్రంథి డి) మెదడు

3. శరీరంలో టెలిఫోన్ వైర్లలా పని చేసే నిర్మాణాలు?
ఎ) సిరలు బి) ధమనులు
సి) కండర తంతువులు డి) నాడులు

4. పోలియో వంటి వ్యాధుల్లో, వైరస్ కారణంగా నశించే కణాలు?
ఎ) మోనోసైట్లు బి) ఎరిత్రోసైట్లు
సి) చాలక నాడీ డి) జ్ఞాన నాడీ

5. నిస్సల్ కణికలు ఉండే కణాలు?
ఎ) ఇస్‌నోఫిల్స్ బి) గ్లియల్ కణాలు
సి) నాడీ కణం డి) లింఫోసైట్

6. నాడీకణాలకు పోషకాలు అందించే కణాలు?
ఎ) ఎరితోసైట్స్ బి) గ్లియల్
సి) మోనోసైట్స్ డి) రక్తఫలకికలు

7. హృదయ స్పందనలను నియంత్రించే ముఖ్యమైన కపాలనాడీ?
ఎ) పూర్వ మహాసిర బి) పరమహాసిర
సి) మహాధమని డి) వేగస్ నాడి

8. మెదడు, వెన్నుపాము నాడీ మండలంలో ఏ విభాగానికి చెందుతాయి?
ఎ) సహాయ భూతనాడీ వ్యవస్థ
బి) సహానుభూత నాడీ వ్యవస్థ
సి) పరిధీయ నాడీ వ్యవస్థ
డి) కేంద్రీయ నాడీ వ్యవస్థ

9. మెదడును కప్పి ఉంచే బయటి పొర?
ఎ) మైలిన్ తొడుగు బి) మృద్వి
సి) లౌతికళ డి) పరాశిక

10. మెదడుని కప్పి ఉండే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం?
ఎ) లింఫ్ బి) ప్లాస్మా
సి) మస్తిష్క మేరుద్రవం డి) సీరం

11. మెదడును కప్పి ఉండే మధ్య పొర?
ఎ) వరాశిక బి) మృద్వి
సి) లౌతికళ డి) ప్లూరా

12. మెదడును కప్పి ఉండే లోపలి పొర?
ఎ) వరాశిక బి) మృద్వి
సి) లౌతికళ డి) ప్లూరా

13. మెదడును కప్పి ఉండే ఎముకలతో ఏర్పడిన పెట్టె లాంటి నిర్మాణం?
ఎ) ఉరో కుహరం బి) ఉదర కుహరం
సి) కపాలం డి) హృదయావరణ కుహరం

14. మానవుడిలో వెన్నునాడుల జతల సంఖ్య?
ఎ) 30 బి) 31 సి) 32 డి) 33

15. మానవుడిలో కపాలనాడుల జతల సంఖ్య?
ఎ) 10 బి) 11 సి) 12 డి) 13

16. మానవుడిలో పరిధీయ నాడుల జతల సంఖ్య?
ఎ) 41 బి) 42 సి) 43 డి) 44

17. వెన్నునాడులన్నీ?
ఎ) అపవాహి నాడులు బి) చాలక నాడులు సి) జ్ఞాన నాడులు
డి) మిశ్రమ నాడులు

18. శరీర సమతాస్థితి, భూమిపై శరీరం ఉండే స్థితులను నియంత్రించేది?
ఎ) మస్తిష్కం బి) అనుమస్తిష్కం
సి) వెన్నుపాము డి) ద్వారగోర్థం

19. శ్వాసక్రియ, హృదయస్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలాజల గ్రంథులు లాలాజలం స్రవించడం... వంటి చర్యలను నియంత్రించేది?
ఎ) మస్తిష్కం బి) అనుమస్తిష్కం
సి) వెన్నుపాము డి) మజ్జాముఖం

20. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి?
ఎ) మజ్జాముఖం బి) అనుమస్తిష్కం
సి) హైపోథాలమస్ డి) వెన్నుపాము

21. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు ఎంత శాతం?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5

22. శరీరంలో కవిత్వం మొదలైన వాటిని ఆనందించే సౌందర్యోపాసన శక్తి ఉన్న అంగం?
ఎ) హృదయం బి) మూత్రపిండం
సి) మెదడు డి) పీయూష గ్రంథి

23. 1990 నుంచి 2000 కాలాన్ని దేని యుగంగా పరిగణిస్తారు?
ఎ) హృదయ బి) శ్రవణేంద్రియ
సి) నేత్ర డి) మెదడు

24. సమస్యలను విశ్లేషించడంలో తోడ్పడే మెదడులోని భాగం?
ఎ) ద్వారగోర్థం బి) అనుమస్తిష్కం
సి) మజ్జాముఖం డి) మస్తిష్కం

25. ఇవాన్ పావ్‌లావ్ వేటిపై ప్రయోగాలు చేశారు?
ఎ) నిబంధన రహిత ప్రతిచర్యల
బి) మస్తిష్క మేరు ద్రవం చర్యల
సి) నిబంధన సహిత ప్రతి చర్యల
డి) పాన్‌‌సవెరోలి చర్యల

26. నాడీ కణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తయ్యే కరెంట్ ఎన్ని ఓల్టులు?
ఎ) 0.055 బి) 0.005
సి) 0.55 డి) 55

27. వేరు పెరిగే భాగం దాని?
ఎ) అగ్రం బి) కొనకింది
సి) కణుపుల మధ్య డి) కాండం కింది

28. మొక్కల్లో ఆక్సిన్‌లు తయారయ్యే స్థలం?
ఎ) కణుపులు బి) ఆకు కాడలు
సి) విభాజ్య కణాలు
డి) కణుపు మధ్య భాగం

29. మొక్కల్లో పెరుగుదల పదార్థాలుంటాయని మొదటిసారి ప్రతిపాదించినవారు?
ఎ) ఎఫ్.డబ్ల్యు.వెంట్ బి) చార్లెస్ డార్విన్ సి) హెబర్ లాండ్ డి) మెల్విన్ కాల్విన్

30. పరిసరాల్లో వచ్చే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ఏమంటారు?
ఎ) ఉద్దీపన బి) అనుక్రియ
సి) క్షోభ్యత డి) పైవన్నీ

31. అగ్రాధిక్యత అంటే?
ఎ) కొనమొగ్గ నిరంతరం పెరగడం
బి) కొనమొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడం
సి) కాండపు కొన తుంచి వేయడం
డి) కొన, పార్శ్వపు కొమ్మలు సమానంగా పెరగడం

32. పొట్టి మొక్కలను పొడవుగా చేయడంలో సహాయపడే హార్మోన్?
ఎ) ఆక్సిన్ బి) సైటోకైనిన్
సి) జిబ్బరెల్లిన్ డి) ఇథలిన్

33. కణవిభజనను ప్రేరేపించే హార్మోన్?
ఎ) ఆక్సిన్ బి) సైటోకైనిన్
సి) జిబ్బరెల్లిన్ డి) ఇథలిన్

34. ఆకులు, ఫలాలు రాలడంలో ప్రభావం చూపే హార్మోన్?


ఎ) ఇండోల్ అసిటిక్ ఆమ్లం
బి) నాఫ్తలిన్ అసిటిక్ ఆమ్లం
సి) జిబ్బరెల్లిన్ డి) అబ్‌సిసిక్ ఆమ్లం

35. అనిషేక ఫలాలు అంటే?
ఎ) విత్తనాలుండే ఫలాలు
బి) విత్తనాలు లేని ఫలాలు
సి) అండాలుండే అండాశయం
డి) అంకురచ్చదం ఉండే విత్తనాలు

36. అనావృష్టి పరిస్థితుల్లో పత్రరంధ్రాలు మూయించి నీటి నష్టం ఆపే హార్మోన్?
ఎ) ఆక్సిన్ బి) జిబ్బరెల్లిన్
సి) సైటోకైనిన్ డి) అబ్‌సిసిక్ ఆమ్లం

37. వినాళ గ్రంథులు ఉండే జీవి?
ఎ) అమీబా బి) వానపాము
సి) యుగ్లీనా డి) మానవుడు

38. వినాళ గ్రంథులు స్రవించే పదార్థం?
ఎ) రక్తం బి) లింఫ్
సి) ఎంజైమ్‌లు డి) హార్మోన్‌లు

39. శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథి?
ఎ) అవటు బి) అధివృక్క
సి) లాంగర్‌హాన్‌‌స పుటికలు
డి) పీయూష

40. నాడీ మండలానికి, అంతస్రావీ గ్రంథి వ్యవస్థకు మధ్య వారధిలా పని చేసే గ్రంథి?
ఎ) అధివృక్క బి) అవటు
సి) ముష్కం డి) పీయూష

41. వాయు నాళానికి దగ్గరగా ఉండే గ్రంథి?
ఎ) క్లోమం బి) కాలేయం
సి) అధివృక్క డి) అవటు

42. లాంగర్‌హాన్‌‌స పుటికలు ఎక్కడ ఉంటాయి?
ఎ) మూత్రపిండం బి) కాలేయం
సి) క్లోమం డి) వాయునాళం

43. ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటిస్ మిల్లటస్ (చక్కెర వ్యాధి) వస్తుంది?
ఎ) టెస్టోస్టిరాన్ బి) ఈస్ట్రోజన్
సి) గ్లూకగాన్ డి) ఇన్సులిన్

44. తల భాగంలో ఉండే వినాళ గ్రంథి?
ఎ) అధివృక్క బి) అవటు
సి) పీయూష డి) పార్శ్వ అవటు

45. శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు?
ఎ) రక్తం బి) లింఫ్
సి) ఎంజైమ్‌లు డి) హార్మోన్‌లు

46. వీటిలో మిశ్రమ గ్రంథి?
ఎ) పీయూష బి) అధివృక్క
సి) క్లోమం డి) స్త్రీ బీజకోశం

47. ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం?
ఎ) పారాథార్మోన్ బి) వేసోప్రెస్సిన్
సి) గ్లూకగాన్ డి) థైరాక్సిన్

48. పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్?
ఎ) టెస్టోస్టిరాన్ బి) ఈస్ట్రోజన్
సి) ప్రొజెస్టిరాన్ డి) ఇన్సులిన్

సమాధానాలు
1) సి 2) డి 3) డి 4) సి 5) సి
6) బి 7) డి 8) సి 9) డి 10) సి
11) సి 12) బి 13) సి 14) బి 15) సి
16) సి 17) డి 18) బి 19) డి 20) డి
21) ఎ 22) సి 23) డి 24) డి 25) సి
26) ఎ 27) బి 28) సి 29) బి 30) సి
31) బి 32) సి 33) బి 34) డి 35) బి
36) డి 37) డి 38) డి 39) డి 40) డి
41) డి 42) సి 43) డి 44) సి 45) డి
46) సి 47) డి 48) సి