.:: 21న సెట్ నోటిఫికేషన్ ::.

10/04/2012 16:32

 

 

ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్-2012) నోటిఫికేషన్ విడుదల కానుంది. యూజీసీ చైర్మన్‌తో 20న సమావేశమై, పరీక్ష నిర్వహణ, తదితరాలపై చర్చించనున్నట్లు సెట్ చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ ఆదివారం ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. సమావేశం ముగిసిన మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెట్ నిర్వహణలో భాగంగా వర్సిటీ మొత్తం 30 సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోగా, యూజీసీ 24 సబ్జెక్టులకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. మిగిలిన వాటికి వచ్చే విద్యా సంవత్సరం అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు.

>>ఏయే కోర్సులకు అనుమతి..:

తెలుగు,

హిందీ,

ఇంగ్ల్లిష్,

ఉర్దూ,

లింగ్విస్టిక్స్,

 చరిత్ర,

అర్థశాస్త్రం,

రాజనీతి శాస్త్రం,

ప్రభుత్వ పాలనా శాస్త్రం,

న్యాయశాస్త్రం,

సామాజిక శాస్త్రం,

తత్వశాస్త్రం,

వాణిజ్యశాస్త్రం,

ఆంత్రోపాలజీ,

సైకాలజీ,

విద్య,

వ్యాయామ విద్య,

మేనేజ్‌మెంట్,

లైఫ్ సెన్సైస్,

ఫిజిక్స్,

మ్యాథమెటిక్స్,

కెమికల్ సైన్స్,

Earth సైన్స్,

>>ఏయే కోర్సులకు అనుమతి..రాలేదు:

కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్‌లకు యూజీసీ నుంచి అనుమతి వచ్చింది.

మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సంస్కృతం, లైబ్రరీ సైన్స్, సోషల్‌వర్క్స్, జాగ్రఫీలకు ఇంకా అనుమతి రాలేదు.

పరీక్ష విధానం:

           >కొన్ని సబ్జెక్టులకు తెలుగు మాధ్యమంలో,

          >మరికొన్ని సబ్జెక్టులకు ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష ఉంటుంది.

          >ఒక్కో సబ్జెక్టుకు మూడు పేపర్లు ఉంటాయి.

          >అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.

> పేపర్-I : 100 మార్కులు

              జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లపై ప్రశ్నలు ఉంటాయి.

> పేపర్-II : 100 మార్కులు

            సంబంధిత సబ్జెక్టుపై అవగాహన పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి.

> పేపర్-III : 150 మార్కులు

             సంబంధిత సబ్జెక్టులపైనే మరింత లోతైన ప్రశ్నలు ఉంటాయి.

ఓయూ వీసీ సత్యనారాయణ

వెల్లడి