టి-20 జట్టులో ఉతప్ప

08/03/2012 11:05 టి-20 జట్టులో ఉతప్ప కర్ణాటక బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప భారత ట్వంటీ-20 జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ఎంపిక న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప భారత ట్వంటీ-20 జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరిగే ఏకైక మ్యాచ్ కోసం సచిన్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. సీనియర్ బ్యాట్స్‌మన్ సచిన్ మొదటి నుంచి అంతర్జాతీయ టి-20లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క మార్పు మినహా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టు సభ్యులే సఫారీకి బయల్దేరతారు. ఈ నెల 30న జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఏకైక ట్వంటీ-20 మ్యాచ్ జరగనుంది. జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి (వైస్ కెప్టెన్), గంభీర్, ఉతప్ప, రోహిత్, రైనా, జడేజా, అశ్విన్, ప్రవీణ్, వినయ్, రాహుల్ శర్మ, యూసుఫ్ పఠాన్, మనోజ్ తివారీ, ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండా.