దక్షిణాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ చిత్తు

17/03/2012 22:41

 

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కివీస్ నిర్దేశించిన 101 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్లు వికెట్ నష్టపోయి ఛేదించింది.

మరో రెండు రోజుల ఆట మిగులుండగానే మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో మూడు

టెస్ట్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం సాధించింది. 10 వికెట్లు పడగొట్టిన

దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. తొలి

ఇన్నింగ్స్‌లో కివీస్ 185, సఫారీ జట్టు 253 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో

న్యూజిలాండ్ 168 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 103/1 స్కోరు సాధించింది.