పంజాబ్ ముఖ్యమంత్రిగా బాదల్

08/03/2012 15:40 పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ప్రకాశ్ సింగ్ బాదల్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాదల్ మార్చి 14 తేదిన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గత 46 సంవత్సరాల పంజాబ్ చరిత్రలో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రికార్డును శిరోమణి అకాలీదళ్, బీజేపీలు తిరగరాశారు. పంజాబ్ రాష్ట్రానికి 85 ఏళ్ల బాదల్ ఐదవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు.