వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడు సచిన్

16/03/2012 20:13

 

వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడు సచిన్

 
 

మీర్పూర్: అంతర్జాతీయ క్రికెట్‑లో సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడ జరుగుతున్న లీగ్ మ్యాచ్‑లో సచిన్ సెంచరీ కొట్టాడు. ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 33 ఇన్నింగ్స్ తరువాత ఈ సెంచరీ కొట్టాడు. 
టెస్ట్‑లో 51 సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‑లో వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడుగా సచిన్ నిలిచాడు. సచిన్188 టెస్ట్ మ్యాచ్‑లు, 462 వన్డే మ్యాచ్‑లు ఆడాడు. అన్ని టెస్ట్ దేశాలపైన సెంచరీ చేశాడు. ఒన్డేల్లో అన్ని టీమ్‑లపై సెంచరీలు చేసిన ఘనత దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాపై అత్యధికంగా 8 సెంచరీలు చేశారు. సచిన్ 1990 ఆగస్ట్ 14న ఇంగ్లండ్‑పై తొలి సెంచరీ చేశాడు.