సచిన్ రికార్డును ఎవరూ చేరుకోలేరు: గిల్లీ

31/03/2012 18:02

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన వంద సెంచరీల రికార్డును ఎవరూ చేరుకోలేరని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. మాస్టర్ సాధించిన ఘనత సామాన్యమైందని కాదని సమీప భవిష్యత్‌లో ఈ రికార్డు దారిదాపుల్లోకి వచ్చేవారెవరూ కనబడడం లేదని ఈ డాషింగ్ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. గత 22 ఏళ్ల నుంచి సచిన్ అంకితభావంతో క్రికెట్ ఆడుతున్నాడని కితాబిచ్చాడు. సచిన్ తర్వాత 71 సెంచరీలతో(టెస్టులు, వన్డేలు కలిపి) రెండో స్థానంలో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డేల నుంచి తప్పుకున్న విషయాన్ని అతడీ సందర్భంగా గుర్తు చేశాడు.