స్పెయిన్ లో ఫుట్ బాల్ అభిమానుల వీరంగం

10/05/2012 21:57

స్పెయిన్‌లో ఫుట్‌బాల్‌ లవర్స్‌ వీరంగం సృష్టించారు. మ్యాడ్రిడ్‌ వీధులలో పోలీసులతో ఘర్షణ పడ్డారు. యూరోపా లీగ్‌ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా రెండు స్పెయిన్ టీమ్‌ల మధ్య పోటీ అనంతరం ఈ ఘర్షణ జరిగింది. అథ్లెటికో మ్యాడ్రిడ్ టీమ్‌... అథ్లెటికో బిల్‌బో టీమ్‌ను 3-0 తేడాతో ఓడించడంతో రెచ్చిపోయిన అభిమానులు, ఈ వీరంగానికి పాల్పడ్డారు.

నెప్‌ట్యూనో స్వ్కేర్ వద్ద అభిమానులు ట్రాఫిక్‌ను నిలువరించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. అభిమానులు పోలీసులపైకి బాటిల్స్‌ విసరడంతో, వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు పలువురును అరెస్ట్ చేసారు.