క్రీడాపాలసీపై ‘శాప్’ సమావేశం

22/03/2012 10:55

 

క్రీడా సంఘాల మొర

 

క్రీడాపాలసీపై ‘శాప్’ సమావేశం

 
 
 

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న స్పోర్ట్స్ పాలసీపై ఎల్బీ స్టేడియం శాప్ కమిటీ హాల్‌లో బుధవారం సమావేశం జరిగింది. శాప్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ టీఆర్‌కే రావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని క్రీడాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివిధ క్రీడాసంఘాల ప్రతినిధులు ఇందులో ప్రస్తావించారు. 

క్రీడాకారుల కోటా రిజర్వేషన్‌లో కులాల వారీగా ప్రాధానత్య ఇవ్వడం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టేడియాలున్నప్పటికీ ప్రయోజం శూన్యమని వారు విమర్శించారు. టెన్నిస్ కోర్టులు యువకుల కంటే వెటరన్స్‌కే ఎక్కవగా ఉపయోగపడుతున్నాయని ఆయా ప్రతినిధులు తెలిపారు. యువ క్రీడాకారులు పే అండ్ ప్లే స్కీమ్‌లో లోపాలను సరిదిద్ది ప్రొఫెషనల్ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కల్పించాలని క్రీడా సంఘాలు కోరాయి. స్పోర్ట్స్ హాస్టల్స్‌ను మళ్లీ ప్రారంభించాలని, అన్ని జిల్లాల్లో కోచ్‌ల సంఖ్యను పెంచాలని సంఘాల ప్రతినిధులు సూచించారు. ఈ సమావేశంలో ట్రిపుల్ ఒలింపియన్ ఎన్. ముకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.