ఎంఈడీ ఆఫర్

 

1. న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంటెక్(మైనింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?- రవి, కరీంనగర్.

జ: న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్,ఫిజిక్స్). యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.andhrauniversity.info

యూనివర్సిటీ ఆఫ్ పుణే-పుణే, ఎంఎస్సీ(ఫిజిక్స్-న్యూక్లియర్ టెక్నిక్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా) కోర్సును అందిస్తుంది. అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్). సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. వివరాలకు: www.unipune.ac.in

ఎంటెక్(మైనింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్:
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
కోర్సు: ఎంటెక్(మైనింగ్ ఇంజనీరింగ్)
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్.
ప్రవేశం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా. గేట్‌లో క్వాలిఫై కాని అభ్యర్థులకు దేశవ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.ismdhanbad.ac.in

2. బీటెక్(ఐటీ) ఫైనలియర్ చదువుతున్నాను. సిస్కో (Cisco) సర్టిఫికేషన్స్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి? -రాఘవేంద్ర, వరంగల్.

జ: నెట్‌వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాల్లో సిస్కో సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు.. తమ నెట్‌వర్కింగ్ కోసం సిస్కో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అందువల్ల సిస్కో సర్టిఫికెట్ కలిగి ఉండడం కెరీర్ ఉన్నతితోపాటు జాబ్ మార్కెట్‌లో మీ అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఇప్పటి వరకు చదివిన బీటెక్ కోర్సుతో నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. 

నెట్‌వర్క్, నిర్వహణ విషయంలో విస్తృత పరిజ్ఞానం సిస్కో సర్టిఫికెట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రారంభంలో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (సీసీఎన్‌ఏ), సర్టిఫైడ్ నెట్‌వర్క్ ప్రొఫెషనల్ (సీసీఎన్‌పీ) కోర్సులు ఉంటాయి. తర్వాత సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్క్ ఇంజనీర్ (సీసీఐఈ), సిస్కో సర్టిఫైడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (సీసీఎస్‌పీ) వంటి అడ్వాన్స్‌డ్ కోర్సులు ఉంటాయి.

కోర్సు పూర్తైన తర్వాత జాబ్ నేచర్‌ను బట్టి వివిధ రకాల బాధ్యతలను నిర్వహించాలి. ఇన్‌స్టాలింగ్ అండ్ అనలైజింగ్ నెట్‌వర్క్స్, మానిటరింగ్ నెట్‌వర్క్, యాడింగ్ న్యూ సర్వర్స్, సిస్టమ్ అప్‌గ్రేడ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్, రైటింగ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, నెట్‌వర్క్ ట్రైనర్స్ వంటి విధులను నిర్వర్తించాలి.
మన దేశంలో.. 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
(www.iisecurity.in) 
నిట్ (www.niit.com), జెట్‌కింగ్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు సిస్కో సర్టిఫికేషన్‌లో శిక్షణను అందిస్తున్నాయి.

3. బయోటెక్నాలజీ స్పెషలైజేషన్‌తో అందుబాటులో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు?
-రాకేష్, రామకృష్ణాపురం.

జ: ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తృతమవుతుండటంతో ఇటీవల కాలంలో బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు కూడా ఊపందుకున్నారుు. దీంతో సంబంధిత కంపెనీలు తమ మార్కెటింగ్ కార్యకలాపాల కోసం స్పెషలైజ్డ్ ఎగ్జిక్యూటి వ్‌లు, మార్కెటింగ్ మేనేజర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో పలు మేనేజ్‌మెంట్ కోర్సులకు రూపకల్పన చేశారుు. అవి.. 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్- బయోటెక్నాలజీ
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్
ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/ఏటీఎంఏ/ఐసెట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.ipeindia.org 
యూనివర్సిటీ ఆఫ్ పుణే
కోర్సు: ఎంబీఏ-బయోటెక్నాలజీ
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సైన్స్‌లో మాస్టర్/బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం: ఏటీఎంఏ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.pumba.in 
అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ-న్యూఢిల్లీ.
కోర్సు: ఎంబీఏ-బయోటెక్నాలజీ
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్.
ప్రవేశం: క్యాట్/మ్యాట్/జీమ్యాట్ లేదా ఇన్‌స్టిట్యూట్ సొంతంగా నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: www.amity.edu 

4. రాష్ట్రంలో ఎంఈడీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -సురేష్, సూర్యాపేట.
జ: ఎంఈడీ కోర్సును రెగ్యులర్‌గా ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kuwarangal.com
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
దూర విద్యా విధానంలో ఎంఈడీ అందిస్తున్న వర్సిటీలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ. వెబ్‌సైట్: ఠీఠీఠీ.జీజౌఠ.్చఛి.జీ
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.braou.ac.in

టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్