11- 06- 2012

 

అగ్రికల్చర్ పాలిటెక్నిక్
వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో 5 గ్రేడ్ పాయింట్లతో (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 4 గ్రేడ్ పాయింట్లతో) ఉత్తీర్ణత. కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్, ఆపై చదువులు చదివిన విద్యార్థులు అనర్హులు. పదో తరగతిలోపు కనీసం నాలుగేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

వయసు: 
ఆగస్ట్ 31, 2012 నాటికి 15 నుంచి 22 ఏళ్లు.
పాలిటెక్నిక్ కళాశాలలు..
విత్తన సాంకేతిక పరిజ్ఞానం: రుద్రూర్, జంగమహేశ్వరపురం
వ్యవసాయం: పాలెం, జగిత్యాల, అనకాపల్లి, మారుటేరు, పొదలకూరు, రెడ్డిపల్లి, ఉట్కూ రు, మడకశిర, గరికపాడు, కంపాసాగర్, బసంత్‌పూర్, చింతపల్లి, లాంఫారం, నంద్యాల, తిరుపతి, వరంగల్, మధిర, సోమశిల, జోగిపేట.
అగ్రికల్చర్ ఇంజనీరింగ్: రాజేంద్రనగర్
పైవాటితో పాటు వివిధ ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ కల్పిస్తారు. 
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి. పూర్తి చేసిన దరఖాస్తులకు ‘కంప్ట్రోలర్, ఏఎన్‌జీఆర్‌ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్’ పేరిట రూ. 400 (ఎస్సీ/ఎస్టీలు 200) డీడీని జత చేసి కింది చిరునామాకు పంపాలి.
చిరునామా: రిజిస్ట్రార్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా భవనం, రాజేంద్రనగర్, హైదరాబాద్- 500030.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
జూన్ 30, 2012
వెబ్‌సైట్: www.angrau.net 

తెలంగాణ వర్సిటీలో పీహెచ్‌డీ
దిగువ పేర్కొన్న అంశాల్లో పీహెచ్‌డీ కోసం నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అంశాలు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు స్టడీస్, ఉర్దూ, మాస్ కమ్యూనికేషన్, బోటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, లా, కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత అంశంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. జేఆర్‌ఎఫ్/ నెట్/ స్లెట్/ రెగ్యులర్ మోడ్‌లో ఎంఫిల్. విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 25, 2012
వెబ్‌సైట్: www.telanganauniversity.ac.in 

యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో
క్లరికల్ కేడర్ పోస్టులు
యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 751
ఎంపిక విధానం: ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్(క్లరికల్) స్కోర్, ఇంటర్వ్యూల ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 22, 2012
వెబ్‌సైట్: www.unitedbankofindia.com