31- 03- 2012 : ఉద్యోగాలు/అడ్మిషన్లు

 

 
 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 
1500 పీఓలు
ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్వ్యూ మే/జూన్-2012లో నిర్వహిస్తారు.
ఖాళీలు: 1500(జనరల్-736, ఓబీసీ-392, ఎస్సీ-223, ఎస్టీ-149)
అర్హత: కనీసం 60 శాతం(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు 55 శాతం) మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఐబీపీఎస్ స్కోరు.
వయసు: జూలై 1, 2011 నాటికి 21 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తులు: ఏప్రిల్ 19, 2012 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ఠీఠీఠీ.జీౌఛ.జీ చూడొచ్చు.

ఐఐఆర్‌ఎం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం).. దిగువ కోర్సు ల్లో డిస్టెన్స్, ఫుల్‌టైంలో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా(ఐపీజీడీఎల్‌ఐ)
జనరల్ ఇన్సూరెన్స్‌లో ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా(ఐపీజీడీజీఐ)
రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నేషనల్ పీజీ డిప్లొమా(ఐపీజీడీఆర్‌ఎం)
కోర్సుల కాల వ్యవధి: ఏడాది
అర్హత: ఏదైనా అంశంలో బ్యాచిలర్ డిగ్రీ+ పని అనుభవం 
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2012
వెబ్‌సైట్: www.iirmworld.org.in 

గమనిక
మార్చి 29, 2012 గురువారం భవితలో 
‘లా సెట్’ నోటిఫికేషన్ సమాచారంలో మూడేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సుకు 20 ఏళ్లుగా ప్రచురితమైంది. వీటికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టులలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున గరిష్ట వయోపరిమితి విషయంలో కోర్టు తుది తీర్పు మేరకు మార్పులు జరిగే అవకాశం ఉంది. గమనించగలరు.

 
VISWANATH ROYAL