ఉద్యోగాలు

 

ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ (జనరల్) బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ల నియామకానికి ప్రకటన విడుదలచేసింది. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అర్హతలు:
టెక్నికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్):
ఇంజనీరింగ్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్(మెకానికల్, మెరైన్, ఆటోమోటివ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మెటలర్జీ, ఏరోనాటికల్)
ఎలక్ట్ట్రికల్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్(ఎలక్ట్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)
వయసు: 19 1/2 నుంచి 25 ఏళ్లు.
సబ్‌మెరైన్ స్పెషలైజేషన్:
ఇంజనీరింగ్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్(మెకానికల్)
ఎలక్ట్రికల్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/ కంట్రోల్)
వయసు: 19 1/2 నుంచి 25 ఏళ్లు.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్( ఏబ్రాంచ్‌తోనైనా)
వయసు: 19 1/2 నుంచి 25 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 1 లోగా చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in 

ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావ్‌నెకోర్ లిమిటెడ్
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావ్‌నెకోర్ లిమిటెడ్-కొచి, మేనేజ్‌మెంట్ ట్రైనీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 50
విభాగాల వారీ ఖాళీలు: కెమికల్-18,
మెకానికల్- 14, ఎలక్ట్రికల్ -9, ఇన్‌స్ట్రుమెంటేషన్ -6, సివిల్ -3
అర్హత: 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎ స్టీలకు 50 శాతం) సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్.
వయసు: జనవరి 1, 2012 నాటికి 26 ఏళ్లు. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 
మార్చి 15, 2012 
వెబ్‌సైట్: https://fact.co.in 

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 514 మెడికల్ ఆఫీసర్లు 
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ కేడర్‌లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, డెంట ల్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
విభాగాల వారీ ఖాళీలు: 
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డి ప్యూటీ కమాండెంట్): 221
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్): 289
డెంటల్ సర్జన్(అసిస్టెంట్ కమాండెంట్): 4
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
మార్చి 30, 2012.
వెబ్‌సైట్: https://crpf.nic.in 

ఏపీపీఎస్సీ-అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)-వివిధ జోన్లలో 403 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జోన్ల వారీగా ఖాళీలు: 
జోన్ 1- 57, జోన్ 2-47, జోన్ 3-36, జోన్ 4-67, జోన్ 5-77, జోన్ 6-119.
అర్హత: స్టాటిస్టిక్స్ ఒక ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదైనా ఒకటి ప్రధాన సబ్జెక్టుగా ఉంటూ వాటితోపాటు డిగ్రీ మూడేళ్లలో స్టాటిస్టిక్స్ కనీసం ఒక పేపర్‌గానైనా కలిగి ఉండాలి. 
వయసు: 18-36 ఏళ్లు. (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయోసడలింపు) 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 9 లోగా చేసుకోవాలి. వెబ్‌సైట్: www.apspsc.gov.in

డీఆర్‌డీఓలో 606 ఖాళీలు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ)కు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
ఖాళీలు: 227
భర్తీ చేసే విభాగాలు: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బోటనీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఫుడ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, ఫొటోగ్రఫీ, జియాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, వెటర్నరీ సైన్స్
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో డిగ్రీ/ డిప్లొమా.
వయసు: 18-28 ఏళ్లు. 
పోస్టు: టెక్నీషియన్-ఎ ఖాళీలు: 119
భర్తీ చేసే విభాగాలు: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రాఫ్ట్‌మ్యాన్(మెకానికల్), ఎలక్ట్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, ఫొటోగ్రాఫర్, రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, ప్రింటింగ్, ప్యాట్రన్ మేకర్, మిల్‌రైట్ మెకానిక్.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్
వయసు: 18-28 ఏళ్లు. 
పోస్టు: అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఖాళీలు: 260
భర్తీ చేసే విభాగాలు: అసిస్టెంట్ హిందీ, స్టోర్ అసిస్టెంట్-ఎ(హిందీ టైపింగ్, ఇంగ్లిష్ టైపింగ్), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(హిందీ టైపింగ్, ఇంగ్లిష్ టైపింగ్), సివిలియన్ డ్రైవర్, సెక్యూరిటీ అసిస్టెంట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్.
అర్హత: హిందీ అసిస్టెంట్ పోస్టులకు ఇంగ్లిష్/హిందీలో పీజీతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. స్టోర్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతితోపాటు లైట్/హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్, ఏడాది అనుభవం. సెక్యూరిటీ, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
పై అన్ని పోస్టులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు: 
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
ఏప్రిల్ 9, 2012.
వెబ్‌సైట్: https://drdo.gov.in