శాప్‌లో భారీగా పదోన్నతులు

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్)లో 31 మంది ఉద్యోగులకు, కోచ్‌లకు పదోన్నతి లభించింది.దాదాపు 18 ఏళ్ల తర్వాత కోచ్‌లు పదోన్నతి పొందడం గమనార్హం. గత నెల 18న శాప్ డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశంలో అర్హత కలిగిన ఉద్యోగులకు, కోచ్‌లకు ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే ఉప ఎన్నికల కోడ్ కారణం గా ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగింది. 

ఎన్నికలు ముగియడంతో సంబంధిత ఉద్యోగులకు, కోచ్‌లకు ప్రమోషన్ కల్పిస్తూ శాప్ మేనేజింగ్ డెరైక్టర్ టి.ఆర్.కె.రావు తాజాగా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హకీంపేట్‌లోని రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న గ్రేడ్-1 కబడ్డీ కోచ్ డాక్టర్ కె.నర్సయ్యను కీలకమైన శాప్ టెక్నికల్ అసిస్టెంట్ డెరైక్టర్‌గా నియమించారు. మినిస్టర్ స్టాఫ్ ఉద్యోగుల్లో జూనియర్ అసిస్టెంట్లను 14 మంది సీనియర్ అసిస్టెంట్లుగా, నలుగురు సీనియర్ అసిస్టెంట్లను సూపరింటెండెంట్లుగా, గ్రేడ్-3 కోచ్‌ల్లో ఏడుగురికి గ్రేడ్-2 కోచ్‌లుగా, గ్రేడ్-2 కోచ్‌ల్లో ఐదుగురికి గ్రేడ్-1 కోచ్‌లుగా పదోన్నతి లభించింది. 

 

ఏఐటీఏ అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా

బెంగళూరు: భారత టెన్నిస్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా నియమితులయ్యారు. ఖన్నా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శనివారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఏకగ్రీవంగా కొత్త ఆఫీస్ బేరర్ల ఎంపిక జరిగింది. గత 12 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న యశ్వంత్ సిన్హా స్థానంలో ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రధాన కార్యదర్శిగా భరత్ ఓజా, సంయుక్త కార్యదర్శిగా సీఎస్ సుందర్ రాజు, కోశాధికారిగా రక్తిమ్ సిఖియా ఎంపికయ్యారు.

 

ఇండోనేసియా ఓపెన్ విజేత సైనా

 జకార్తా: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ ను ఆమె సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ జురుయ్ లీ (చైనా)ను 13-21, 22-20, 21-19 తేడాతో ఓడించింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మొదటి సెట్ గెల్చుకున్న సైనా రెండో సెట్ లో వెనుకబడింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో పుంజుకుని ప్రత్యర్థిని మట్టి కరిపించి విజేతగా అవతరించింది. 

ఈ హైదరాబాదీ షట్లర్ 2009, 2010లోనూ ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇండోనేసియా టైటిల్స్ గెల్చుకోవడం ద్వారా సైనా నెహ్వాల్ సత్తా చాటింది.

ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడు=. 8 కోట్ల 73 లక్షల ప్రైజ్‌మనీ సొంతం - జొకోవిచ్ చేజారిన ‘గ్రాండ్‌స్లామ్’

 

 


https://sakshi.com/newsimages/contentimages/12062012/NADAL-NEW12-6-12-48413.jpg


ఎర్రమట్టి కోటలో తానే రారాజునని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను ఏడు సార్లు గెల్చుకున్న ఆరో క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందాడు.

పారిస్: ఓ అద్భుతం నమోదైంది. ఊహించినట్టే నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. క్లే కోర్టులపై తన పట్టును ప్రపంచానికి చాటాడు. సోమవారం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ (స్పెయిన్) 6-4, 6-3, 2-6, 7-5తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. 

https://sakshi.com/newsimages/contentimages/12062012/SPORTS-1112-6-12-49225.jpg

ఈ విజయంతో ఇప్పటిదాకా ఆరు టైటిల్స్‌తో స్వీడన్ దిగ్గజం జాన్ బోర్గ్ పేరిట ఉన్న ఈ ఫ్రెంచ్ రికార్డును బద్దలు కొట్టాడు. అదే సమయంలో తాజా విజయంతో వరుసగా నాలుగు ‘గ్రాండ్‌స్లామ్ టైటిల్స్’ గెలవాలని... ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేయాలని భావించిన జొకోవిచ్ ఆశలను వమ్ము చేశాడు. గత చివరి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో (2011 వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్) జొకోవిచ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. విజేతగా నిలిచిన నాదల్‌కు 12 లక్షల 50 వేల యూరోలు (రూ. 8 కోట్ల 73 లక్షలు)... రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 6 లక్షల 25 వేల యూరోలు (రూ. 4 కోట్ల 36 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ప్రస్తుతం నాదల్ ఖాతాలో 7 ఫ్రెంచ్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 యుఎస్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి.

బ్రేక్ పాయింట్‌తో మొదలు...
https://sakshi.com/newsimages/contentimages/12062012/ok12-6-12-49585.jpg

వర్షంతో ఆదివారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి నాదల్ 6-4, 6-3, 2-6, 1-2తో ఉన్నాడు. సోమవారం ఫైనల్ మొదలైన వెంటనే జొకోవిచ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి స్కోరును 2-2 వద్ద సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. నాదల్ 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్ 12వ గేమ్‌లో సర్వీస్ చేశాడు. 

కీలకమైన బ్రేక్ పాయింట్ సాధించి మ్యాచ్‌ను ముగించాలనే లక్ష్యంతో కనిపించిన నాదల్ సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ జొకోవిచ్‌పై ఒత్తిడి పెంచాడు. మ్యాచ్‌లో నిలవాలంటే సర్వీస్ నిలబెట్టుకునే పరిస్థితిలో జొకోవిచ్ తడబడ్డాడు. 30-40తో వెనుకబడిన దశలో ఈ సెర్బియా స్టార్ ‘డబుల్ ఫాల్ట్’ చేసి తన సర్వీస్‌ను కోల్పోవడంతోపాటు మ్యాచ్‌నూ చేజార్చుకున్నాడు.

అత్యంత మధుర క్షణాలు‘‘ప్రపంచంలోనే ఫ్రెంచ్ ఓపెన్‌కు ఎంతోప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏడోసారి విజేతగా నిలువడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో ఇవి అత్యంత మధుర క్షణాలు.’’
- నాదల్

ఎనిమిదేళ్లలో ఒకే ఓటమి

ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ 2005లో అరంగేట్రం చేశాడు. బరిలోకి దిగిన తొలిసారే అతను
విజేతగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు టైటిల్‌ను సాధించాడు. 2009 ప్రిక్వార్టర్ ఫైనల్లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో నాదల్ అనూహ్యంగా ఓడిపోయాడు. అయితే 2010, 2011, 2012లలో ఈ స్పెయిన్ స్టార్ మళ్లీ చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఫ్రెంచ్
ఓపెన్‌లో తన గెలుపోటముల రికార్డును 52-1కి పెంచుకున్నాడు.

 

 

సచిన్‌కు విజ్డెన్అవార్డు

దుబాయ్: https://sakshi.com/newsimages/contentimages/12062012/WISDEN12-6-12-56600.jpgఅంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్న భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ‘విజ్డెన్ ఇండియా అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. ఫిడెలిస్ వరల్డ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సచిన్ ఈ పురస్కారం స్వీకరించాడు. పుస్తకంలోని ఖాళీ పేజీలపై ఒక క్రికెట్ బంతిని ఉంచినట్లుగా తయారు చేసిన ప్రత్యేక క్రిస్టల్ ట్రోఫీని ఈ సందర్భంగా మాస్టర్‌కు అందజేశారు. ఈ ట్రోఫీకి ఒక వైపు టెస్టుల్లో సచిన్ చేసిన 51 సెంచరీలు, మరో వైపు 49 వన్డే సెంచరీల జాబితాను ముద్రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచిన్, చెన్నై (2008)లో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీనే తన అత్యుత్తమమని పేర్కొన్నాడు. 

 

ప్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్

పారిస్: రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. జోకోవిచ్‑పై 6-4,6-3,2-6,7-5 తేడాతో నాదల్ విజయం సాధించాడు. నాదల్ ఏడవ సారి ఈ టైటిల్‑ని గెలుచుకున్నాడు. ప్రైజ్ మనీగా నాదల్‑కు 8 కోట్ల 67 లక్షల రూపాయలు లభిస్తాయి. అతనికి ఇది 11వ గ్రాండ్‑స్లామ్ టైటిల్. ఏడు ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా, ఒక యుఎస్ టైటిల్స్‑ని నాదల్ గెలుచుకున్నాడు.

 

FOX SPORTS NEWS

థాయ్ ఓపెన్‑లో సైనా నెహ్వాల్ గెలుపు – sakshi.com 10-06-12

బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. టాప్‌ సీడ్‌ సైనా నెహ్వాల్‌ థాయ్‌ ఓపెన్‌ గెలుచుకుంది. బ్యాంకాక్‌లో ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో సీడ్‌ రచనోక్ ఇంతనోన్‑పై 19-21, 21-15, 21-10 స్కోర్‌తో సైనా గెలుపొందింది.

 

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు..

వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్లను సక్రమంగా నిర్వహించడమే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు సంబంధించి షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పర్యవేక్షణ, పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, సంబంధిత వర్గాలకు తగిన సౌకర్యాలు కల్పించడం వరకు అన్నీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ముఖ్య విధులు. 

అంతేకాకుండా టోర్నీలకు తగిన ప్రచారం కల్పించడం, మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేబాధ్యత కూడా వీరిదే. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో స్పోర్ట్స్ మేనేజర్‌గా అవకాశాలుంటాయి. ఆయా టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పీఆర్‌ఓగా కూడా వ్యవహరించవచ్చు. 

అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించే పర్సనల్ మేనేజర్, ఏజెంట్స్‌గా, పీఆర్‌ఓగా అవకాశాలుంటాయి. టైగర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి ప్రైవేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ క్రీడా సంస్థల్లో కూడా వీరికి అవకాశాలుంటాయి. క్లబ్‌లు, హోటల్స్, రిసార్టులు, స్పోర్ట్స్ సెంటర్లు కూడా స్పోర్ట్స్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. విదేశాల్లోనూ అనేక అవకాశాలుంటాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: 
పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్;
అలగప్ప యూనివర్సిటీ -తమిళనాడు (డిస్టెన్స్‌లో)
వెబ్‌సైట్: www.alagappauniversity.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా
వెబ్‌సైట్: www.iiswbm.edu
లక్ష్మిబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-గ్వాలియర్.
వెబ్‌సైట్: www.lnipe.gov.in
ఎంబీఏ(స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్): తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.tnpesu.org